Reading Time: < 1 minute
యుద్ధ మేఘాల నడుమ సురక్షితంగా చేరిన LPG నౌకలు !!

యుద్ధ మేఘాల నడుమ భారత్‌కు ఎల్పీజీ సరఫరాకు ఊరట లభించింది. ఇరాన్‌కు సమీపంలోని కీలకమైన హోర్ముజ్ జలసంధి మీదుగా ఎల్పీజీ ట్యాంకర్ నందాదేవి సురక్షితంగా జామ్‌నగర్‌లోని వాడినార్ పోర్టుకు చేరింది. ఈ నౌకతో 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ భారత్‌కు వచ్చింది. ఇది దేశీయంగా ఎల్పీజీ పరేషాన్‌ను తగ్గించనుంది. భారత్‌కు చేరుకున్న రెండో ఎల్పీజీ నౌకగా నందాదేవి గుర్తించబడింది. అంతకుముందు శివాలిక్ అనే తొలి ట్యాంకర్ నౌక కూడా సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. ఇరాన్ నుంచి భారత్ వరకు ఈ రెండు నౌకలు కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రయాణించాయి. భారత నౌకాదళం ఈ ట్యాంకర్లకు అడుగడుగునా భద్రత కల్పించి, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎల్పీజీని గమ్యస్థానానికి చేర్చింది. వాడినార్ పోర్టులో ఎల్పీజీని ఇతర నౌకల్లోకి బదిలీ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ పరిణామం దేశ ఇంధన భద్రతకు దోహదపడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

KTR: ఫ్యూచర్ సిటీకి అసలు ఫ్యూచర్ ఉందా ??

మీ డబ్బు – మీ హక్కు !! బ్యాంకుల్లో మర్చిపోయిన వేల కోట్లు.. ఆర్బీఐ సరికొత్త ప్రచారం

సిలిండర్ కోసం ‘చెప్పుల’ క్యూ !! ప్రజలకు తీరని గ్యాస్ కష్టాలు !!