Reading Time: < 1 minute
AP Polycet 2026 Deadline: ఏపీ పాలీసెట్ 2026కు ముగుస్తున్న గడువు.. మీరు దరఖాస్తు చేశారా?

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 3 నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత పొందినవారితోపాటు ఈ ఏడాది మార్చిలో పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు కూడా పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 4, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో సీట్లు భర్తీ చేస్తారు.

ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు దరఖాస్తు ఫీజు కింద రూ.400 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 4, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కెరీర్‌లో త్వరగా స్థిరపడాలనుకునే వారు పాలీసెట్‌ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు వీలుగా రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణామండలి (SBTET) ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

రాత పరీక్ష విధానం..

పాలీసెట్‌ పరీక్ష మూడు విభాగాల నుంచి మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 120 మార్కులకు 2 గంటల వ్యవధిలో ఉంటుంది. మ్యాథమెటిక్స్‌ విభాగంలో 50 ప్రశ్నలు, ఫిజిక్స్‌ విభాగం నుంచి 40 ప్రశ్నలు, కెమిస్ట్రీ విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్ ఉండదు.

ఏపీ పాలీసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.