Reading Time: < 1 minute
LPG Gas: వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!

LPG Gas: భారతదేశంలో వంట గ్యాస్ (LPG) విషయంలో ప్రస్తుతం అనేక ప్రధాన మార్పులు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, గ్యాస్, చమురు సరఫరాలపై ప్రభావం దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. యుద్ధం కారణంగా దేశంలో తలెత్తిన ఎల్‌పీజీగ్యాస్‌పై ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వంట గ్యాస్‌ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులు 100 శాతం ఎల్‌పీజీ సరఫరా చేయనున్నట్లు తెలిపింది.

ప్రతి రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్‌ స్టాక్‌ ఉందని వెల్లడించింది. హర్మూజ్‌ దగ్గర భారతీయ నౌకలు క్షేమంగా వస్తున్నాయని తెలిపింది. ఎల్‌పీజీ గ్యాస్ గురించి వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఎల్‌పీజీ గ్యాస్‌ పూర్తి స్థాయిలో స్టాక్‌ ఉందని తెలిపింది.

ఇది కూడా చదవండి: బ్యాంకుకు వెళ్తున్నారా? మీకో బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్‌!

హర్మూజ్‌ జలసంధి ప్రత్యేకత ఏంటి?

ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు, గ్యాస్‌ రవాణాలో కూడా పెద్ద భాగం ఈ మార్గం గుండా జరుగుతుంది.
ఈ మార్గంలో అంతరాయం కలిగితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశముంది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచే భారీగా ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్‌కు ఇది అత్యంత కీలక మార్గం. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధి పరిణామాలను ప్రపంచ దేశాలు, షిప్పింగ్‌ సంస్థలు అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఇలాంటి సమయంలో భారత్‌కు సురక్షిత మార్గం కల్పించే అంశంపై ఇరాన్‌ చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

ఇది కూడా చదవండి: Rythu Bharosa: మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. రైతు భరోసా పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి