July 8, 2026

Sunil Gavaskar: ఆ ఇద్దర్నీ ఫైనల్‌ నుంచి తప్పించాల్సిందే.. సునీల్‌ గావస్కర్‌ సంచలన వ్యాఖ్యలు..

Sunil Gavaskar: ఆ ఇద్దర్నీ ఫైనల్‌ నుంచి తప్పించాల్సిందే.. సునీల్‌ గావస్కర్‌ సంచలన వ్యాఖ్యలు..
Reading Time: 2 minutes
India Vs New Zealand T20 World Cup 2026 Final Sunil Gavaskar Playing 11 Suggestions

ఇండియా, న్యూజిలాండ్ మధ్య ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌ కంటే ముందే టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది.

అభిషేక్ శర్మను తప్పించాలని గావస్కర్ సలహా…
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న ఓపెనర్ అభిషేక్ శర్మను ఫైనల్ మ్యాచ్ నుంచి పక్కన పెట్టాలని ఆయన అన్నారు. ఈ టోర్నమెంట్ అంతటా అభిషేక్ ఆడటానికి చాలా కష్టపడ్డారని.. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆయన బలహీనత స్పష్టంగా కనిపిస్తోందని గావస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్‌లో ఆయన కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటారు.. మూడు సార్లు ఆఫ్ స్పిన్నర్ల చేతిలో అవుట్ అయ్యారు.

Also Read:PM Modi: తృణమూల్ అహంకారం ముక్కలవుతుంది.. మమతా సర్కార్‌పై ప్రధాని ఫైర్..

సెమీఫైనల్లో కూడా అభిషేక్ శర్మ తన పేలవ ప్రదర్శనను కొనసాగించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఈ టోర్నమెంట్‌లో ఆయన చేసిన పరుగులు ఇలా ఉన్నాయి.. 0, 0, 0, 15, 55, 10 మరియు 9. అంటే మొత్తం 7 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 89 పరుగులు మాత్రమే చేశారు. అభిషేక్ శర్మ యావరేజ్ కూడా చాలా తక్కువగా (12.71) ఉంది.

అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్-1 బ్యాటర్ అయినప్పటికీ.. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదని గావస్కర్ విమర్శించారు. బౌలర్లు పదే పదే ఆయన బలహీనతపై దెబ్బకొడుతున్నా.. అభిషేక్ అదే రీతిలో అవుట్ అవుతున్నారని ఆయన అన్నారు.

Also Read:PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి నిధులు జమ అయ్యేది అప్పుడే..!

జట్టులో ఉండాల్సిన వారు వీరే..
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైనల్ కోసం జట్టులో మార్పులు చేయాలని గావస్కర్ సూచించారు. ఇషాన్ కిషన్ను సంజూ శాంసన్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపాలన్నారు. జట్టులోకి రింకూ సింగ్ను తీసుకోవాలన్నారు. ఎందుకంటే రింకూకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఇలాంటి పెద్ద మ్యాచుల్లో ఆయన అద్భుతాలు చేయగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక బౌలింగ్ విభాగంలోనూ మార్పులు చేయాలని గావస్కర్ చెప్పారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో కులదీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలన్నారు. గత కొన్ని మ్యాచుల్లో వరుణ్ బౌలింగ్ లో ప్రత్యర్థి టీమ్స్ భారీగా పరుగులు సాధించాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ కేవలం 13 బంతుల్లోనే వరుణ్ బౌలింగ్‌లో 42 పరుగులు చేయడం గమనార్హం. అహ్మదాబాద్ వంటి పెద్ద మైదానాల్లో కులదీప్ యాదవ్ అయితే బ్యాటర్లను బోల్తా కొట్టించగలరని గావస్కర్ నమ్ముతున్నారు. మరి ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమ్ మేనేజ్‌మెంట్ గావస్కర్ సలహాలను వింటుందో లేదో చూడాలి.

Also Read:CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..

సునీల్ గావస్కర్ సూచించిన టీమ్ ఇండియా ప్లేయింగ్-11 ఇలా ఉంది. సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కులదీప్ యాదవ్.