Reading Time: < 1 minute
IND vs NZ, T20 WC Final Live Score: ఫైనల్‌కు రంగం సిద్ధం.. భారత్ గెలిస్తే తొలి జట్టుగా సరికొత్త రికార్డ్..

India vs New Zealand, T20 WC world cup 2026 Final Live Score in Telugu: ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ సాయంత్రం 6:30 గంటలకు జరుగుతుంది. పొట్టి ఫార్మాట్‌లో ఐసీసీ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి.

రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన భారత్ నాలుగో ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తన రెండో ఫైనల్‌కు చేరుకుని తొలి ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టైటిల్ మ్యాచ్‌లో ఓడిపోయింది.