
ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్ టీమిండియాకు సవాల్ వంటిదేనని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఇంగ్లండ్‌కు ఉందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు చాలా బలంగా ఉందన్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లతో పాటు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారన్నాడు. దీంతో భారత్ ఏమాత్రం నిర్లక్షంగా ఆడినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గవాస్కర్ హెచ్చరించాడు.