Reading Time: 1 minute

 ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నగర వాసులను భయాందోళనల్లో నెట్టేస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అలా చిక్కుకుపోయిన వారిలో సుమారు 2వేల మంది హైదరాబాదీయులే ఉన్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటు న్నాయి. దీంతో ఇక్కడ ఉంటున్న వారి కుటుంబీకులు ఆందోళన అంతా ఇంతా కాదు. అయితే, సోమవారం రాత్రి దుబాయ్ ఎయిర్‌పోర్టును పునరుద్ధరించారు. భారత్‌కు వెళ్లే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ, ముంబై విమానాలు టేకాఫ్ అయ్యాయి. హైదరాబాద్ ప్రయాణికుల కోసం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బోర్డింగ్ పాసులు ఇచ్చినా ఫ్లైట్‌ను రద్దు చేసింది. ప్రయాణికులను తిరిగి హోటల్‌కు తరలిస్తున్నట్లు ఓ ప్రయాణికుడు వెల్లడించారు. దుబాయి పర్యాటకం ప్రత్యేక అనుభూతిని కల్పించనుండటంతో నగరానికి చెందిన చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి కన బరుస్తారు.

గతేడాది శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 5,23,107 మంది ప్రయాణించినట్లు సమాచారం. ఇందులో 50–60శాతం మంది టూరి స్టులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతీ రోజు 5-6 విమానాలు నేరుగా వెళుతుండగా, 15 వరకు కనె క్టింగ్ విమానాలున్నాయి. రోజుకు సగటున 1400–1500 మంది వెళ్తుంటారు. నగరంలో దాదాపు 1801 ట్రావెల్ ఏజెన్సీలున్నాయి. ఇందు లో 123 పేరొందిన సంస్థలే ఉన్నాయి. గల్ఫ్‌లో యుద్ధం జరుగుతుండడంతో దుబాయికి వెళ్లేవారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారు. దుబాయితో పాటు ఇతర దేశాల ప్రయాణాలకు కూడా ఎవరూ ఇష్టపడడంలేదని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహ కులు చెబుతున్న మాటగా ఉంది. మార్చిలో ప్రయాణించేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న నగరవాసులు ఆందోళనకు లోనవు తున్నారు. యుద్ధ భయంతో అక్కడికి వెళ్లలేమని చెబుతూ డబ్బులు రీఫండ్ చేయాలని ట్రావెల్ ఏజెన్సీల చుట్టూ తిరుగాడుతున్నారు. దీంతో నిర్వాహకులు కొందరికి సర్దిచెబుతూ, వారు కోరిన విధంగా ఇతర తేదీల్లో ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు.

మరికొందరికి డబ్బులను రీఫండ్ చేస్తున్నారు. కాగా, డబ్బులు ఇవ్వలేని సంస్థలు వారికి మరికొన్ని ఇతర ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశాలు, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని పర్యాటకాన్ని సంద ర్శించేందుకు వీలు కల్పిస్తున్నారు. మొత్తంగా ఇరాన్–ఇజ్రాయెల్ నడుమ జరుగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జా తీయ పర్యాటకంపై భారీగా పడిందని పలువురు ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు.