Reading Time: < 1 minute

తనపై సోషల్ మీడియాలో చేస్తోన్న అసభ్యకర కామెంట్స్‌పై నటి రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్ర యిం చారు. ఈ మేరకు సోమవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొందరు తన పోస్టులకు అసభ్యకరంగా కామెంట్స్ పెడుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. అసభ్యకరమైన కామెంట్స్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరా రు. కాగా, వీధి కుక్కల అంశంపై మాట్లాడిన నాటి నుంచి సోషల్ మీడియాలో కొందరు రేణు దేశాయ్‌ను టార్గెట్ చేస్తున్నారు.

ఆమె పోస్టులకు రాయలేని బాషలో కామెంట్స్ పెట్టడంతో పాటు అసభ్యకరమైన మీమ్స్ క్రియేట్ చేయడం వంటివి చేస్తున్నారు. దీనిపై తాజాగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై అసభ్య కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు. తన వ్యక్తిగత జీవితం, పిల్లలు గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నారని బాధపడ్డారు. ఇన్నాళ్లు ఏమన్నా ఓపికా పట్టాను, ఇక భరించడం తన వల్ల కాదన్నారు. ఇకపై సోషల్ మీడియాలో తనపై అసభ్యకర కామెంట్లు చేసే వాళ్ల ఇంటికి వచ్చి సంగతి తేలుస్తానని హెచ్చరించారు.