
పోరులో పొరపాటు..మిత్రదేశం కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ దాడులలో అమెరికా ఎఫ్ 15 ఇ యుద్ధ విమానాలు మూడు కుప్పలుగా లాయి. పలు దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతూ , ప్రతీకారం తీర్చుకుంటున్న దశలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కువైట్ సేనలు అనుకోకుండా తమ ఎఫ్ ఫైటర్ విమానాలను కూల్చివేశాయనే విషయాన్ని అమెరికా సైనిక విభాగం కూడా ధృవీకరించింది. అయితే ఈ మూడు ఫైటర్స్ పతనం దశలో మొత్తం ఆరుగురు సిబ్బంది సురక్షితంగా బయట పడ్డారు. ఇతరత్రా నష్టం వివరాలు ఇప్పటి ఘర్షణల తీవ్రత నడుమ వెలుగులోకి రాలేదు. అయితే అమెరికా సేనలకు చివరికి మిత్రపక్షంతోనే భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది. ఇరాన్ తమ దాడుల్లో భాగంగా కువైట్‌పై కూడా విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఎఫ్ 15 ఇ ఈగల్స్‌ను కువైట్ సేనలు ఇరాన్ ప్రయోగించివవి అనుకుని కూల్చేశాయి. సిబ్బంది క్షేమంగా ఉన్నారని, పోరుకు రెడీ అయ్యారని కువైట్ తెలిపింది. కువైట్ అధికారులు కూడా ఇప్పటి ఘటనను నిర్థారించారు. ఇప్పటి ఆపరేషన్‌లో ఎప్పటికప్పుడు తమ సైనిక బలగాలు స్పందిస్తున్న తీరును కొనియాడారు.