Reading Time: < 1 minute

అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇరాన్‌ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం ఖమేనీ మరణించారు. దీంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ యుద్ధం ప్రభావం ఓ క్రికెట్ సిరీస్‌పై పడింది. పాకిస్థాన్ షాహీన్స్‌తో (ఎ జట్టు), జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లండ్ లయన్స్ (ఎ జట్టు) రద్దు చేసుకుంది. నిజానికి ఈ సిరీస్ అబుదాబీ వేదికగా జరగాల్సి ఉంది.

కానీ, అమెరికా ఎయిర్‌బేస్‌లు లక్ష్యంగా ఇరాన్ అబుదాబీపై దాడులు చేస్తోంది. దీంతో ఇంగ్లండ్ లయన్స్ జట్టు మరియు సపోర్ట్ స్టాఫ్ అక్కడే చిక్కుకుపోయారు. అయితే భారతకాలమానం ప్రకారం మార్చి 1న ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ లయన్స్-పాకిస్థాన్ షాహీన్స్ మధ్య రెండో వన్డే జరగాల్సి ఉండింది. అయితే భద్రతా కారణఆల వల్ల ఈ మ్యాచ్‌తో పాటు మిగతా సిరీస్ మొత్తం రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. ‘‘జట్టు భద్రత మా ప్రాధాన్యం పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నాం’’ అని ఇసిబి ఓ ప్రకటనలో పేర్కొంది.