Reading Time: < 1 minute
Sree Vishnu Mrithyunjay Movie Trailer Launched By Jr Ntr

టాలీవుడ్‌లో విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించే హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) శనివారం విడుదల చేశారు. ట్రైలర్ కట్ చూస్తుంటే, శ్రీవిష్ణు ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడటం ఖాయమనిపిస్తోంది.

Also Read : Holi 2026 : ఈసారి రంగుల పండుగ ఎప్పుడు? చంద్రగ్రహణం వల్ల తేదీల్లో మార్పులు ఇవే!

శ్రీవిష్ణు గత చిత్రాల కంటే భిన్నంగా ‘మృత్యుంజయ’లో చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీవిష్ణు నటన, నేపధ్య సంగీతం, విజువల్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో ఈ ట్రైలర్‌కు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. “శ్రీవిష్ణు అన్న.. అసలు ఎలాంటి కంటెంట్ కావాలనుకున్నానో సరిగ్గా అలాంటి ట్రైలర్ ఇచ్చావు” అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ చిత్రం మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మృత్యుంజయ’ ఒక మంచి ట్రీట్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. తారక్ సపోర్ట్ తోడవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.