Reading Time: < 1 minute

మఠాన్ని కూల్చడమంటే మనోభావాలు దెబ్బతీయడమే : హరీశ్ రావు

Caption of Image.

కోకాపేట్ నియోపోలిస్‌లోని  రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని బలవంతంగా ఖాళీ చేయించేందుకు రేవంత్ సర్కార్  ప్రయత్నిస్తుందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇవాళ ఉదయం కోకాపేట్ లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. మఠాన్ని కూల్చడమంటే మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు.  గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలయ నిర్మాణానికి 2 ఎకరాల స్థలం కేటాయిస్తే. ఆ  స్థలాన్ని లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం  కుట్ర చేస్తోందన్నారు.  పీఠం నిర్వాహకులను భయాందోళనలకు గురిచేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   దేవాలయాల పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు దారుణమని ఫైర్ అయ్యారు. 

దేవాలయాన్ని ఎందుకు  కూల్చాలనుకుంటున్నారో  సీఎం రేవంత్ రెడ్డి  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు . నిత్య అన్నదానం, వేద పాఠశాల, గోశాల, అమ్మవారి ఆలయం, ఇవన్నీ ఉండటం నీకు ఇష్టం లేదా  రేవంత్ అని ప్రశ్నించారు. కేసీఆర్ అనవాళ్ళు మారుస్తాను అంటే ఆఖరికి కేసీఆర్ కట్టిన గుడులు కూడా కూలుస్తారా అని నిలదీశారు. కూల్చడమేనా  సీఎం రేవంత్ పాలన అని మండిపడ్డారు.  హరీశ్ రాకతో  ఆలయం దగ్గరకు  రెవెన్యూ, పోలీసు అధికారులు భారీగా చేరుకున్నారు.   కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

©️ VIL Media Pvt Ltd.