Reading Time: < 1 minute

విద్యార్థుల కు క్రీడలు ఔషధం లాంటివి : మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ

Caption of Image.

కోల్​బెల్ట్, వెలుగు: క్రీడలు విద్యార్థులకు ఔషధం లాంటివని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ అన్నారు. బుధవారం మందమర్రిలోని సింగరేణి మైదానంలో రాష్ట్రంలోని శ్రీచైతన్య స్కూళ్ల జోనల్‌ క్రీడాపోటీలు నిర్వహిచారు. మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, గోదావరిఖని, కాగజ్‌నగర్ ఏరియాలకు చెందిన సుమారు 800 మంది స్టూడెంట్లు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి జీఎం రాధాకృష్ణ, డీవైజీఎం అశోక్‌, ఎంఈవో రమేశ్​ రాథోడ్‌ చీఫ్​ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరక దారుఢ్యాన్ని కలిగిస్తాయన్నారు. విజేతలను స్కూళ్ల చైర్మన్‌ మల్లెంపాటి శ్రీధర్‌, డైరెక్టర్‌ శ్రీవిద్య అభినందించారు. శ్రీ చైతన్య స్కూల్ డివిజనల్ మేనేజర్ సదాశివ రెడ్డి, మంచిర్యాల ఏజీఎం అరవింద్ రెడ్డి, కరీంనగర్ ఏజీఎం ఎం.రాజు, అన్ని హెచ్​ఎంలు, కో-ఆర్డినేటర్లు, టీచర్లు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.