Reading Time: < 1 minute

నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రైవేట్ కళాశాలల సంఘం ఆందోళన

Caption of Image.

హైదరాబాద్: నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం ఆందోళనకు దిగింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఛాంబర్‎లో బైఠాయించారు సంఘం నాయకులు. 400 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం కల్పించకుండా ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 విద్యార్థులకు న్యాయం చేయకుండా బోర్డ్ కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. తక్షణమే విద్యార్థులకు హల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్‎కు అనుమతించాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడు గంటలుగా ఛాంబర్‎లో బైఠాయించారు. 

©️ VIL Media Pvt Ltd.