గుండెకు పదిలం: జామపండులో ఉండే పొటాషియం, కరిగే ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.
స్త్రీలకు ఒక వరం: చాలామంది మహిళలు ఎదుర్కొనే ఋతుక్రమ సమస్యలకు జామ ఒక సహజ పరిష్కారం. జామ ఆకుల సారం లేదా పండులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
జీర్ణక్రియ మెరుగు: నేటి కాలంలో ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం సర్వసాధారణమైంది. జామపండులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ జామను తీసుకుంటే మలబద్ధకం సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.
రోగనిరోధక శక్తి: నారింజ పండు కంటే జామలో విటమిన్ సి రెట్టింపు ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు దరిచేరకుండా చూస్తుంది.
మెరిసే చర్మం మీ సొంతం: జామలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. విటమిన్ సి చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. ఇది చర్మంపై ఉండే మచ్చలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
జామపండులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండుగా అనిపించి, అనవసరమైన ఆకలిని తగ్గిస్తుంది. అంతేకాకుండా జామలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వదు. ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.





