Reading Time: < 1 minute
IND vs WI: భారత్ vs వెస్టిండీస్ పోరుకు రెడీ.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?

IND vs WI Schedule 2026: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమ్ ఇండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 17 మధ్య భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ సిరీస్‌కు సంబంధించిన వన్డే, టీ20 జట్లను ఇప్పటికే ప్రకటించింది.

వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఈ నెల 27న త్రివేండ్రం వేదికగా జరగనుంది. రెండో వన్డే 30వ తేదీన గుహటిలో, చివరిదైన మూడో వన్డే చండీగఢ్‌లో జరగనుంది. ఈ వన్డే మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.

ఎక్కువమంది చదివినది: Team India: అందరికీ న్యాయం చేశారు.. కానీ, ఆ ఒక్కడినే ఎందుకు బలి చేశారు గంభీర్ జీ..!

ఆ తర్వాత, టీ20 సిరీస్ అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్ లక్నో వేదికగా అక్టోబర్ 6న, రెండో టీ20 అక్టోబర్ 9న రాంచీలో, మూడో టీ20 అక్టోబర్ 11న ఇండోర్‌లో, నాలుగో టీ20 అక్టోబర్ 14న హైదరాబాద్‌లో, చివరిదైన ఐదో టీ20 అక్టోబర్ 17న బెంగళూరులో జరగనుంది. ఈ టీ20 మ్యాచ్‌లన్నీ రాత్రి 7:00 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, ఓటీటీలో జియో హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..