
న్యూఢిల్లీ: ఐసీసీ మహిళల తొలి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారైంది. ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2027, ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ఈ టోర్నీ జరగనుంది. ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI – బ్రాబోర్న్ స్టేడియం), గుజరాత్‌లోని వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొదట ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ శ్రీలంక క్రికెటర్ బోర్డు పరిపాలనలో ప్రభుత్వ జోక్యం, ఇతర అంతర్గత సమస్యల కారణంగా టోర్నీ వేదికను ఐసీసీ మార్చింది. భారత్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా దేశాలను పరిశీలించిన ఐసీసీ.. చివరకు భారత్‌ను ప్రత్యామ్నాయ హోస్ట్‌గా ఫిక్స్ చేసింది.
►ALSO READ | చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి లక్ష్య సేన్ ఔట్
టీ20 ఫార్మాట్ లో జరగనున్న ఐసీసీ మహిళల తొలి ఛాంపియన్స్ ట్రోఫీ రౌండ్-రాబిన్ పద్ధతిలో సాగుతుంది. లీగ్ దశ ముగిసిన తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న ఫైనల్‌లో తలపడతాయి. ఈ చారిత్రాత్మక టోర్నీలో ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక.. మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి.