Reading Time: 2 minutes
Trisha : జన నాయగన్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన త్రిష.. విజయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెట్టింట వైరల్..

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్. జూలై 23న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఉదయం నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రాగా.. మొదటి రోజే మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని తన అధికారులతో కలిసి వీక్షించారు సీఎం విజయ్. మరోవైపు కోలీవుడ్ సెలబ్రేటీలు సైతం విజయ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ముందు నుంచి వార్తలలో నిలుస్తున్న హీరోయిన్ త్రిష సైతం జన నాయగన్ మొదటి రోజు మొదటి షోను అస్సలు మిస్ అవ్వలేదు. చెన్నైలోని రోహిణి థియేటర్లో తన తల్లితోపాటు స్నేహితులతో కలిసి విజయ్ సినిమాను వీక్షించింది. అనంతరం థియేటర్ నుంచి ఆమె ఆనందంగా నవ్వుతూ బయటకు వచ్చిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అలాగే ఈ సినిమా గురించి ఆమె చేసిన పోస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

“చివరిసారిగా చివరి డ్యాన్స్ (One Last Time.. One Last Dance)” అంటూ తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. ఇక థియేటర్ వద్ద జనాలను క్రేజ్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ “త్రిషా కృష్ణన్, నిరుపమ ఎన్ లతో కలిసి ప్రాణాలతో బయటపడ్డాను” అంటూ తన స్నేహితురాలు ప్రియ శ్యామ్ షేర్ చేసింది. జన నాయగన్ చిత్రంలో విజయ్ జోడిగా పూజా హెగ్డే నటించగా.. కేరళ కుట్టి మమితా బైజు కీలకపాత్ర పోషించింది. ఇక బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా కనిపించాడు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

త్రిష పోస్ట్..

Trisha Insta Post

Trisha Insta Post

ఇదిలా ఉంటే.. అంతకు ముందు విజయ్, త్రిష కలిసి లియో చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఎంతో స్టైలీష్, గ్లామరస్ లుక్కులో కనిపించింది. ముఖ్యంగా త్రిష, విజయ్ జోడికి మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది త్రిష.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

జన నాయగన్ థియేటర్లో త్రిష..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..