రిలయన్స్ అజియో బ్యూటీ షురూ

న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ అజియో బ్యూటీ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. ఈ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా చర్మ సంరక్షణ, మేకప్, హెయిర్‌కేర్, సువాసనలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. అజియో డిజిటల్ నెట్‌వర్క్ , రిలయన్స్ ఓమ్నిచానెల్ బ్యూటీ వెంచర్ అయిన టిరా నైపుణ్యాన్ని కలిపి దీనిని రూపొందించారు.
దీనిద్వారా సుమారు 1,500 భారతీయ , అంతర్జాతీయ బ్రాండ్లు వాల్యూ, ప్రీమియం, లగ్జరీ విభాగాలలో లభిస్తాయని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా 19,000 పిన్ కోడ్‌లకు డెలివరీ సేవలు అందిస్తారు. కొన్ని నగరాల్లో అజియో రష్ ద్వారా వేగవంతమైన డెలివరీ సౌకర్యం ఉంటుందని రిలయన్స్ వెల్లడించింది.
వినియోగదారుల ఆధునిక అవసరాలకు తగినట్లుగా వ్యక్తిగతీకరించిన సిఫార్సులు అందించడం ఈ ప్లాట్‌ఫారమ్ ప్రత్యేకత. రిలయన్స్ రిటైల్ వెంచర్ల పరిధిలో దేశవ్యాప్తంగా 20,169 స్టోర్లు పనిచేస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.3.70 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింది.