July 23, 2026

సర్కారు కాలేజీ స్టూడెంట్లకు హెటిరో ఇంటర్న్‌‌‌‌షిప్స్..సంస్థతో ఇంటర్ విద్యాశాఖ ఎంఓయూ

సర్కారు కాలేజీ స్టూడెంట్లకు హెటిరో ఇంటర్న్‌‌‌‌షిప్స్..సంస్థతో ఇంటర్ విద్యాశాఖ ఎంఓయూ
Reading Time: < 1 minute

సర్కారు కాలేజీ స్టూడెంట్లకు హెటిరో ఇంటర్న్‌‌‌‌షిప్స్..సంస్థతో ఇంటర్ విద్యాశాఖ ఎంఓయూ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: సర్కారు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ కీలక అడుగు వేసింది. బుధవారం హైదరాబాద్‌‌‌‌లో హెటిరో డ్రగ్స్ సంస్థతో ఇంటర్ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువు పూర్తి చేయగానే రోడ్డున పడకుండా, వారికి ఫార్మా రంగంలో సుస్థిరమైన ఉపాధి దొరికేలా చూడటమే తమ లక్ష్యమని చెప్పారు.

కేవలం సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా, ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలను నేర్పించి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఒకేషనల్, లైఫ్ సైన్సెస్ కోర్సులు చదువుతున్న 300 మందికి పైగా విద్యార్థులకు హెటిరో డ్రగ్స్‌‌‌‌లో తక్షణమే ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కేవలం కొలువులే కాకుండా, చదువుకునే కాలంలోనే ఇండస్ట్రీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇంటర్న్‌‌‌‌షిప్స్ అందించనున్నారు.

అలాగే సీఎస్‌‌‌‌ఆర్  కింద కాలేజీల్లోని ల్యాబ్‌‌‌‌లను ఆధునీకరించేందుకు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఫ్యాకల్టీకి శిక్షణ ఇచ్చేందుకు హెటిరో సంస్థ సహకారం అందించనుంది. కార్యక్రమంలో హెటిరో హెచ్‌‌‌‌ఆర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. వెంకట జయపాల్ రెడ్డి, ఇంటర్ విద్యాశాఖ జేడీ వెంక్యా నాయక్, ఎస్ఐవీఈ ప్రిన్సిపాల్ జ్యోత్స్నారాణి పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.