
హైదరాబాద్: ప్రసిద్ధ బాలాపూర్ గణనాథుడిని ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు పట్లోళ్ల కౌశిక్ రెడ్డీతో కలిసి శనివారం (సెప్టెంబర్ 19) రాత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవర కొండ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాపూర్ మహా గణపతిని దర్శించుకున్న విజయ్ దేవర కొండను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం శాలువాతో ఘనంగా సత్కరించి, లడ్డు ను ప్రసాదం అందజేశారు. విజయ్ దేవరకొండ రాకతో బాలాపూర్‌లో సందడి నెలకొంది. అక్కడ ఉన్న భక్తులు సెల్ ఫోన్లో విజయ్ దేవర కొండ ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అంతేగాకుండా మండపంలో విజయ్ అన్న అంటూ భక్తులు ఆప్యాయంగా పలకరించడం కనిపించింది.