
SJ Suryah Bodhi: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఇండస్ట్రీ హిట్ ‘జైలర్’ సీక్వెల్‌పై ఇండియన్ సినీ లవర్స్ పెట్టుకున్న భారీ అంచనాలను నిజం చేస్తూ మేకర్స్ సంచలన అప్‌డేట్స్‌తో రంగంలోకి దిగారు. సూపర్ స్టార్ రజినీకాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రిలీజ్ చేసిన అధికారిక క్యారెక్టర్ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ యాక్టర్‌గా మారిన ఎస్.జే.సూర్య పాత్రను ఈ ప్రోమో ద్వారా అఫీషియల్‌గా రివీల్ చేశారు. ‘జైలర్ 2’లో ఎస్.జే.సూర్య పోషిస్తున్న పాత్ర పేరు ‘బోధి’. ఈ ప్రోమోలో ఆయన చూపించిన స్వాగ్, బాడీ లాంగ్వేజ్ అచ్చం రజినీకాంత్ మార్క్ మ్యానరిజమ్‌ను తలపించేలా ఉండటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
విలనిజంలో సరికొత్త మేనరిజమ్స్‌తో స్క్రీన్‌ను శాసించే ఎస్.జే.సూర్య, మరోవైపు టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ మధ్య వచ్చే సన్నివేశాలు వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని స్పష్టమవుతోంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎమ్ ప్రోమోను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. సన్ పిక్చర్స్ ‘జైలర్ 2’ విషయంలో ప్రమోషన్ల జోరును అమాంతం పెంచేసింది. నిన్నటికి నిన్న ప్రముఖ మలయాళ నటుడు సూరజ్ వెంజారమూడును ‘దిలీప్’ పాత్రలో పరిచయం చేస్తూ అప్‌డేట్ ఇవ్వగా, సరిగ్గా 24 గంటలు గడవకముందే ఎస్.జే.సూర్య లుక్‌ను వదిలి సర్‌ప్రైజ్ చేశారు. ఇక మొదటి భాగంలో అలరించిన రమ్యకృష్ణ, స్టార్ కమెడియన్ యోగిబాబు ఈ సీక్వెల్‌లోనూ కీలక పాత్రల్లో కొనసాగుతున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ తన డార్క్ కామెడీ, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు మరింత పదును పెట్టి ఈ సీక్వెల్‌ను బిగ్గెస్ట్ మల్టీస్టారర్ లెవెల్‌లో ప్లాన్ చేశారు. ప్రోమోలతోనే హైప్ ఆకాశాన్ని తాకుతుండగా, ఈ చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీ, బోధిగా ఎస్.జే.సూర్య మధ్య విధ్వంసం ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 15న థియేటర్లలో ఏ స్థాయి తుఫాను రేగనుందో చూడాలి.
Introducing SJ Suryah as Bodhi from the world of #Jailer2
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @iam_SJSuryah #SurajVenjaramoodu @vijaykartikdop @Nirmalcuts @ChethanDsouza @AlwaysJani @KiranDrk #PallaviSingh @valentino_suren @Alagiakoothan #SantoshRaju… pic.twitter.com/FKVlMlc0rM
— Sun Pictures (@sunpictures) September 19, 2026
