July 23, 2026

Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..

Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
Reading Time: < 1 minute
Lalit Modi To Return To India After 16 Years Following Relief In Ipl Fema Case

Lalit Modi: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్‌కు సంబంధించి విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్ నుంచి కీలక ఊరట లభించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2010 నుంచి లలిత్ మోడీ విదేశాల్లో ఉంటున్నారు. 16 ఏళ్ల న్యాయ పోరాటానికి ముగింపు వచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్ రావాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

ట్రైబ్యునల్ తీర్పులో నిజం వెలుగులోకి వచ్చిందని, ఐపీఎల్ ప్రయోజనాల కోసమే తాను పనిచేశానని, ఇప్పుడు ఆ అధ్యాయం ముగిసిందని, భారత్ తిరిగి రావాలని అనుకుంటుననట్లు లలిత్ మోడీ చెప్పారు. 2009లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్‌ కోసం నిధుల తరలింపులపై FEMA కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విధించిన చాలా ఆరోపణల్ని, జరిమానాలను స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్స్ (ఫార్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ) చట్టం (SAFEMA) కింద ఉన్న అప్పీలేట్ ట్రైబ్యునల్ కొట్టివేసింది.

ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం, 2009 ఐపీఎల్ నిర్వాహణ కోసం జరిగిన విదేశీ నిధుల బదిలీల్లో లలిత్ మోడీ FEMA ఉల్లంఘనలకు బాధ్యుడని నిరూపించే ఆధారాలేవి లేవని పేర్కొంది. జూలై 16న తీర్పు వెలువడింది. 2009లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఐపీఎల్‌ను భారత్ నుంచి దక్షిణాఫ్రికా తరలించారు. ఈ టోర్నీ నిర్వహణ కోసం విదేశీ చెట్టింపులపై ఆర్‌బీఐ అనుమతి అవసరమని పేర్కొంటూ ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.