July 23, 2026

Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?

Balakrishna : బాలయ్యకి సర్జరీ.. NBK 111 పరిస్థితి ఏంటి?
Reading Time: < 1 minute
Balakrishna Nbk108 Injury Release Delay Gopichand Malineni Updates

యాక్షన్ సీన్ షూటింగ్ లో బాలకృష్ణ గాయపడ్డాడు. మోకాలికి చిన్న గాయమైందని, గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి త్వరలో మైనర్ సర్జరీ చేస్తారని చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని తెలిపారు. రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచించడంతో NBK111 రిలీజ్ మరింత లేట్ కానుంది. మేకర్స్ అనుకున్న టైం కు సినిమా థియేటర్ లోకి వస్తుందా, రాదా? బాలకృష్ణ నటిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ కాకినాడ పోర్ట్ లో జరుగుతోంది. కాకినాడ ఎయిర్‌పోర్ట్ లో దిగిన బాలయ్యకు ఘన స్వాగతం పలికారు. యాక్షన్ సీన్స్ ఇంకో రెండు రోజుల్లో ముగియనుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం స్కానింగ్ తీయగా, మజిల్ టియర్ అయిందని, త్వరగా కోలుకోవడానికి చిన్నపాటి సర్జరీ అవసరమవుతుందని డాక్టర్లు సూచించారు.

అభిమానులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, త్వరలో కోలుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటారని ఎక్స్ వేదికగా డైరెక్టర్ ట్వీట్ చేశాడు. బాబాయి త్వరగా కోలుకోవాలని అబ్బాయిలు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎక్స్ వేదికగా వేర్వేరు పోస్టులు పెట్టారు. త్వరగా కోలుకొని తిరిగి గర్జించాలని ఎన్టీఆర్ పోస్ట్ చేశాడు. తక్కువ టైంలోనే మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి రావాలని కళ్యాణ్ రామ్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. NBK111 ను దసరాకే రిలీజ్ చేయాలనుకున్నా, షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ప్రభాస్ ఫౌజీ డిసెంబర్ 3న రావడంతో, క్రిస్మస్ హాలిడేస్ ను క్యాష్ చేసుకుంటూ డిసెంబర్ 24న రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో నిర్మాతలు ఉన్నారు. అనుకోకుండా బాలకృష్ణకు ప్రమాదం జరగడంతో, సినిమా క్రిస్మస్ కి వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం జరుగుతోంది. బాలయ్య వెంటనే కోలుకొని సెట్స్ పైకి వస్తే, సినిమా డిసెంబర్ 24న రావడం పెద్ద కష్టమేమీ కాదు.