Reading Time: < 1 minute
Kamalhassan There Is A Friendly Rivalry Between Me And Rajinikanth There Is Never Any Jealousy

కోలీవుడ్ సినిమా స్టార్స్ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు తమిళనాట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ సీఎం కావడంపట్ల తనకు ఎలాంటి అనసూయ లేదు…నేను రాజకీయాల్లో లేను. అలాంటప్పుడు విజయ్‌ను చూసి నేను ఎందుకు అసూయ పడాలి. కమల్ హాసన్ సీఎం ఆయింటే అసూయా ఉండేదేమో అని వ్యాఖ్యానిచారు. తలైవా చేసిన ఈ వ్యాఖ్యలపై కమల్ హాసన్ తనదైన శైలిలో స్పందించారు. రజనీకాంత్‌తో తనకున్న బంధం గురించి అలాగే విజయ్ కొత్త ప్రభుత్వం గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 కమల్ హాసన్ మాట్లాడుతూ.. “నాకు, రజనీకాంత్‌కు మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంది. మా మధ్య అసూయ అనేదే లేదు. ఒకవేళ మేము సినిమా రంగంలో కాకుండా క్రికెట్ రంగంలో ఉండి ఉన్నా కూడా మా మధ్య ఇదే రకమైన స్నేహం, పోటీ ఉండేవి” అంటూ దశాబ్దాలుగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని కమల్ హాసన్ మరోసారి గుర్తుచేశారు. ఇక తమిళనాడు నూతన సీఎం సినీనటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం  ప్రభుత్వాన్నుద్దేసిస్తూ “పదవిలోకి వచ్చిన రెండు రోజులకే విజయ్ పరిపాలన ఎలా ఉంది? అని అడిగితే ఏం చెప్తాం? ఒకవేళ ఇప్పుడే దాని గురించి మాట్లాడితే అది కేవలం జ్యోతిష్యం చెప్పినట్లే అవుతుంది తప్ప వాస్తవం కాదు. కొత్తగా వచ్చిన వారిని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు అలాగని వారి నుండి మరీ ఎక్కువగా ఆశించకూడదు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఆరు నెలల టైం ఇద్దాం. అప్పుడే వారి పనితీరుపై ఒక అంచనాకు రాగలం. ఈ లోగా మీడియా వారి పరిపాలనను నిరంతరం గమనిస్తూ ఉండాలి ప్రజాపక్షాన మేము కూడా పర్యవేక్షిస్తూనే ఉంటాం” అని కమల్ హాసన్ అన్నారు. అటు రజనీ ఇటు కమల్ చేసిన కామెంట్స్ ఇప్పడు చెన్నై మీడియా వర్గాలలో హాట్ టాపిక్ అయ్యాయి.