July 15, 2026

Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
Reading Time: < 1 minute
Ramya Krishna Dance With Ntr Before Wedding Night Simhadri Song Viral

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రమ్యకృష్ణ నాలుగు దశాబ్దాలుగా ‘క్వీన్’లా వెలిగిపోతున్నారంటే దానికి కారణం ఆమె అందం మాత్రమే కాదు, అంతులేని డెడికేషన్ కూడా. ‘భలే మిత్రులు’తో ప్రేక్షకులకు పరిచయమై.. 80ల చివర నుంచి 90ల వరకు స్టార్ హీరోయిన్‌గా అగ్రహీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి టాప్ హీరోలతో నటించి స్టార్‌డమ్ అందుకుంది. అయితే తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన పెళ్ళి గురించి చెప్పిన విషయం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

2003లో రమ్యకృష్ణ గారు డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తెల్లవారితే తన పెళ్లి అనగా.. ఆ ముందు రోజు రాత్రి వరకు ఆమె షూటింగ్‌లోనే ఉన్నారట! ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘సింహాద్రి’ సినిమాలో “చిన్నదమ్మే చీకులు కావాలా” అనే స్పెషల్ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. ఆ పాట షూటింగ్ లాస్ట్ మినిట్‌లో ప్లాన్ చేయడంతో, వేరే దారి లేక రమ్యకృష్ణ గారు రాత్రంతా డ్యాన్స్ చేశారట..‘తెల్లవారితే నా పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్ చేస్తూనే ఉన్నాను. ఆ డ్యాన్స్ పూర్తయ్యాక అక్కడి నుంచి నేరుగా పెళ్లి మండపానికి వెళ్లాను’ అని రమ్యకృష్ణ చెప్పడంతో ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సాధారణంగా పెళ్లి అంటే వారం రోజుల ముందు నుంచే బ్రేక్ తీసుకుంటారు, కానీ పనికి ఆమె ఇచ్చిన గౌరవం చూసి నెటిజన్లు ‘స్టార్ అంటే ఇలా ఉండాలి’ అని పొగిడేస్తున్నారు. అందుకేనేమో, ఇప్పటికీ ఆమెకు సాటి వచ్చే నటి టాలీవుడ్‌లో మరొకరు లేరు. పెళ్లి పీటల మీద కూడా ఆ గ్లో తగ్గకుండా ఆమె ఎలా మేనేజ్ చేశారో అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు.