Reading Time: < 1 minute
Pawan Kalyan Delimitation Comments Janasena Meeting Ap

JLP సమావేశంలో డీలిమిటేషన్ అంశంపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని… పునర్విభజనలో వాస్తవిక దృక్పథం అవసరమని పవన్ స్పష్టం చేశారు. 2009లో జరిగిన పునర్విభజన అనుభవాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా, సహేతుకంగా ఈ ప్రక్రియజరగాలన్నారు.ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలకు చేరువగా ఉండాలని… నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గణనీయంగా పెరుగుతాయని… ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను 50 శాతం పెంచడం హర్షణీయమని పేర్కొన్నారు. 88 అసెంబ్లీ, 12 వరకు పార్లమెంట్ సీట్లు పెరిగి… దాదాపు 100 మందికి కొత్త అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ఈ ప్రక్రియ ఎక్కడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేసిన పవన్… డీలిమిటేషన్‌పై పార్టీ ఎలా ముందుకు వెళ్లాలి, ఎలాంటి కార్యాచరణ ఉండాలన్నదానిపై సూచనలు చేసేందుకు ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేయాలని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు సూచించారు.కమిటీ నివేదిక ఆధారంగా జనసేన డీలిమిటేషన్‌పై తన కార్యాచరణను ఖరారు చేసుకోనున్నట్లు తెలిపారు.