Reading Time: < 1 minute
Ahmad Vahidi Iran Irgc Commander Israel Hit List War Strategy

Ahmad Vahidi: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన వ్యూహకర్తను రంగంలోకి దించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీలక నేతలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్లిష్ట సమయంలో IRGC పగ్గాలను బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీ చేపట్టారు.

READ ALSO: Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు

గెరిల్లా యుద్ధంతో శత్రువులకు సవాల్
అమెరికా, ఇజ్రాయెల్ వంటి అగ్రరాజ్యాల అత్యాధునిక ఆయుధ సంపత్తిని ఎదుర్కోవడానికి వాహిదీ “అసమాన యుద్ధం” (Asymmetric Warfare) అనే సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రత్యక్ష యుద్ధం కంటే గెరిల్లా దాడులు, ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, మానసిక ఒత్తిడి పెంచడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు.

హోర్ముజ్ జలసంధిపై పట్టు: ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గాన్ని నియంత్రించడం ద్వారా ప్రత్యర్థుల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం.

ప్రాక్సీ నెట్‌వర్క్: ఖుద్స్ దళం ద్వారా విదేశాల్లోని గూఢచార వ్యవస్థను బలోపేతం చేయడం.

టార్గెట్ దాడులు: శత్రువుల రాడార్ వ్యవస్థలు, చమురు ట్యాంకర్లు, విమానాశ్రయాలపై ప్రతీకార దాడులు చేయడం.

అజేయమైన వ్యూహకర్తగా గుర్తింపు..
గత మూడు దశాబ్దాలుగా ఖమేనీ ప్రధాన బృందంలో సభ్యుడిగా ఉన్న వాహిదీకి రక్షణ, అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. క్షిపణి, అణు కార్యక్రమాల అభివృద్ధిలో ఆయన పోషించిన పాత్ర కారణంగానే అమెరికా, ఇజ్రాయెల్ ఏజెన్సీలు ఆయనను తమ ‘హిట్ లిస్ట్’లో అగ్రస్థానంలో ఉంచాయి. “మొస్సాద్, సీఐఏ వంటి దిగ్గజ నిఘా సంస్థలు కూడా ఇప్పటివరకు వాహిదీని ఆపలేకపోయాయి. ఇరాన్ సైనిక చరిత్రలో ఆయన ఒక ఓడించలేని మేధావిగా పేరు తెచ్చుకున్నారు.” 1994లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన యూదు సాంస్కృతిక కేంద్రం దాడిలో వాహిదీ ప్రమేయం ఉందన్న ఆరోపణలతో అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ, ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో, సైనిక నిర్ణయాల్లో ఆయన స్థానం అచంచలం. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిన తరుణంలో, వాహిదీ రచించే “వార్ ప్లాన్” మధ్యప్రాచ్య భవిష్యత్తును నిర్ణయించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Dhurandhar 2: ధురంధర్ 2 లో పాకిస్థాన్ మాజీ ప్రధాని..