Reading Time: < 1 minute

చెన్నై: బుల్లితెర నటి దేవి ప్రియ కారును మరో కారు ఢీకొట్టడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఆమె సహాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన తమళనాడు రాష్ట్రం పెరంబలూరు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బుల్లితెర నటి దేవి ప్రియ తన కారులో చెన్నై నుంచి తిరుచ్చి వెళ్తోంది. పెరంబలూరు కారు టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తు గణేశన్ పక్కకు ఆపి టైర్ ను మార్చుతున్నాడు. అతి వేగంతో మరో కారు వీళ్ల కారును ఢీకొట్టడంతో డ్రైవర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఆమె సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడడంతో ఆస్ప్రత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.