Reading Time: < 1 minute

ఆరుగురు ఉద్యోగులకు నోటీసులు ఇవ్వండి.. విధులకు డుమ్మా కొట్టడంపై కలెక్టర్ ఆగ్రహం

Caption of Image.
  • సికింద్రాబాద్​తహసీల్దార్​ఆఫీస్​ తనిఖీ

పద్మారావునగర్, వెలుగు: ప్రజలకు జవాబుదారీతనంతో సేవలందించాలని కలెక్టర్ ప్రియాంక ఆల సూచించారు.  మంగళవారం ఆమె సికింద్రాబాద్ తహసీల్దార్ ఆఫీస్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఆరుగురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్.. భూముల రిజిస్టర్లు, పీవోబీ(నిషేధిత భూములు), ల్యాండ్‌‌బ్యాంక్ వివరాలు తెలుసుకున్నారు. కంప్యూటర్ సెక్షన్‌‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సామాజిక పింఛన్ల పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. అప్లికేషన్లను వేగంగా పరిష్కరించాలని చెప్పారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.   

©️ VIL Media Pvt Ltd.