Reading Time: < 1 minute

శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టులో బుల్లెట్‌‌ కలకలం..ప్రయాణికుడి లగేజీలో గుర్తించిన భద్రతా సిబ్బంది

Caption of Image.

గండిపేట, వెలుగు: రాజీవ్‌‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్​లభ్యమైన ఘటన కలకలం రేపింది. మంగళవారం కోల్‌‌కతా మీదుగా శంషాబాద్‌‌ విమానాశ్రయం నుంచి రియాద్‌‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఇండిగో విమాన ప్రయాణికుడి లగేజీని జీఎంఆర్‌‌ భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. అందులో బుల్లెట్​కనిపించడంతో ఎయిర్‌‌పోర్ట్‌‌ సెక్యూరిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సదరు ప్రయాణికుడిని శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌ అవుట్‌‌పోస్ట్‌‌ పోలీసులకు అప్పగించారు. బుల్లెట్‌‌ ప్రయాణికుడి లగేజీలోకి ఎలా వచ్చిందనే కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.