
- ఇయ్యాల మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం
హైదరాబాద్, వెలుగు: సీఎస్‌తో మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన ఉద్యోగ సంఘాల సమావేశం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సీఎం రివ్యూలో సీఎస్ బిజీగా ఉండటం, డిప్యూటీ సీఎం కూడా అందుబాటులో లేకపోవడంతో సమావేశం జరగలేదు. అయితే జేఏసీ డిమాండ్ చేసిన నాలుగు ప్రధాన డిమాండ్లపై సీఎస్.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించారు.
అనంతరం సీఎస్ జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇయ్యాల మధ్యాహ్నం 2 గంటలకు జేఏసీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.
అలాగే నాలుగు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నేటి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.