Reading Time: < 1 minute
Balakrishnas Voiceover Highlights Dont Trouble The Trouble Trailer

నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ డైలాగ్స్ డెలివరీకి, మాస్ మేనరిజమ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది.  అయితే ఇప్పటివరకు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన పవర్‌ఫుల్ వాయిస్‌తో అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు బాలయ్య. మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం  “Don’t Trouble the Trouble”. ఒకప్పుడు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని డైలాగ్ నే ఫహద్ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్రంలో కథలోని కీలక సన్నివేశాలకు, నేరేషన్‌కు బాలకృష్ణ తన వాయిస్ ఓవర్ అందించారు. బాలయ్య చెప్పిన వాయిస్ ఓవర్ కథనానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా, సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. డబ్బులు, ట్రబుల్స్ తో ట్రావెల్ అయ్యే హీరో లైఫ్ లోకి వచ్చిన ఓ పాప వచ్చిన తర్వాత అతని లైఫ్ లో ఎలాంటి మ్యాజిక్ జరిగిందనే కాన్సెప్ట్ తో వస్తోంది Don’t Trouble the Trouble. ప్రొడక్షన్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ విలక్షణ చిత్రాన్ని శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజమౌళి మరియు కార్తికేయల కోసమే బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం. ఆకట్టుకునే కథాంశంతో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.