Reading Time: < 1 minute
Mehbooba Mufti Backs Cjp Protest Delhi

Mehbooba Mufti:  జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ సీజేపీ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గురువారం ఆమె నిరసనకు మద్దతు తెలిపారు. పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనల్ని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, యువత భవిష్యత్తును కాపాడే పోరాటంగా అభివర్ణించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తీవ్రమైన ఎండను తట్టుకుని నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థుల్ని అభినందించారు. ఈ ఉద్యమం అవినీతి, పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని ఇస్తుందని అన్నారు.

గత 12 ఏళ్లుగా దేశంలో విభజన రాజకీయాలు, అవినీతి, పేపర్ లీకులు, మహిళలపై నేరాలు పెరిగాయని ఆమె ఆరోపించారు. ఈ రోజు మన దేశంలో పిల్లల కన్నా ఆవులే ఎక్కువ సురక్షితంగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థపై విమర్శలు చేశారు. ఇన్ని రోజులుగా విద్యార్థుల ఉద్యమం జరుగుతున్నా వారి సమస్యల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, యువత ఆందోళనల్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వ అహంకారం ఎక్కువ రోజులు నిలవదని, యువత శక్తి కన్నా గొప్ప శక్తి లేదని, రాజ్యాంగాన్ని కాపాడేది యువతే అని ఆమె అన్నారు.