నీట్ నిరసనలపై సచిన్ పోస్ట్ వైరల్..తండ్రి నేర్పిన పాఠాన్ని గుర్తు చేసుకున్న లిటిల్ మాస్టర్

నీట్ నిరసనలపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఫెల్యూర్ కామన్ .. కానీ చీటింగ్ చేయకూడదు.. అది ఎప్పటికీ సరైనది కాదు.. అడ్డదారులు తొక్కకుండా కష్టపడి పనిచేసే త్వత్వాన్ని సమాజం ప్రోత్సహించాలని సచిన్ తన సోషల్ మీడియా బ్లాగ్ X ద్వారా పోస్ట్ షేర్ చేశారు.
తన తండ్రి తనకు నేర్పిన పాఠాన్ని ఉదహరిస్తూ సచిన్ ఈ పోస్ట్ రాశారు. ‘‘ ఓడిపోవడం సహజమే.. అయితే మోసం చేయడం సరైంది కాదు.. అదే సమయంలో అడ్డదారులు తొక్కడం ఎప్పుడూ క్షమించరానిదని తన తండ్రి చెప్పిన మాటలను సచిన్ గుర్తు చేసుకున్నారు. కష్టపడి పనిచేసే తత్వాన్ని సమాజం ప్రోత్సహించాలని సచిన్ సూచించారు. విద్యార్థుల్లో ఉత్సాహం తగ్గకుండా పేరెంట్స్, టీచర్లు మంచి ఎన్విరాన్ మెంట్ ను సృష్టించాలని కోరారు. పరిష్కారాలు విద్యార్థుల ఆకాంక్షలను కాపాడతాయని టెండూల్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
— Sachin Tendulkar (@sachin_rt) July 23, 2026