July 23, 2026

టాలీవుడ్‌‌‌‌ లో మళ్లీ బిజీగా.. పూజా హెగ్డే..

టాలీవుడ్‌‌‌‌ లో మళ్లీ బిజీగా.. పూజా హెగ్డే..
Reading Time: < 1 minute

టాలీవుడ్‌‌‌‌ లో మళ్లీ బిజీగా.. పూజా హెగ్డే..

Caption of Image.

గతంలో టాలీవుడ్‌‌‌‌  స్టార్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్‌‌‌‌గా ఓ వెలుగు వెలిగిన పూజాహెగ్డేకు గత కొంతకాలంగా తెలుగులో అవకాశాలు తగ్గాయి. మరోవైపు హిందీలోనూ పరాజయాలు పలకరిస్తున్నాయి.  ప్రస్తుతం దుల్కర్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటిస్తున్న ‘శ్రీ శ్రీ’ మినహా తెలుగులో ఆమెకు సినిమాలు లేవు.  ఈ క్రమంలో బ్యాక్ టు బ్యాక్ రెండు అవకాశాలు ఆమెను వరించినట్టు తెలుస్తోంది.  అందులో ఒకటి అల్లు అర్జున్ సినిమా కావడం విశేషం. 

ప్రస్తుతం అట్లీ తీస్తున్న ‘రాకా’లో నటిస్తున్న అల్లు అర్జున్‌‌‌‌ ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌‌‌‌లో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌‌‌‌గా పూజాహెగ్డేను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికే బన్నీతో ‘అల వైకుంఠపురములో..’ లాంటి బ్లాక్‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌తో పాటు అంతకంటే ముందు ‘డీజే:  దువ్వాడం జగన్నాథం’లోనూ పూజా హెగ్డే నటించింది. 

ఇక లోకేష్‌‌‌‌ కనగరాజ్‌‌‌‌ ‘కూలీ’లో ఆమె చేసిన స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే.  ఈ క్రమంలో హిట్ కాంబో రిపీట్‌‌‌‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రవితేజ, శ్రీ విష్ణు హీరోలుగా హసిత్ గోలి తెరకెక్కించినున్న మల్టీస్టారర్‌‌‌‌లోనూ ఓ హీరోయిన్‌‌‌‌గా పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. ఇక గురువారం విజయ్ ‘జన నాయకుడు’ చిత్రంతో ఆమె ప్రేక్షకుల 
ముందుకొస్తోంది.  

©️ VIL Media Pvt Ltd.