July 23, 2026

పెద్దపల్లి జిల్లా కూనారంలో రైలు పట్టాలపై ఇరుక్కున్న లారీ..

పెద్దపల్లి జిల్లా కూనారంలో రైలు పట్టాలపై ఇరుక్కున్న లారీ..
Reading Time: < 1 minute

పెద్దపల్లి జిల్లా కూనారంలో రైలు పట్టాలపై ఇరుక్కున్న లారీ..

Caption of Image.

పెద్దపల్లి జిల్లాలో రైల్వే ట్రాక్ పై ధాన్యం  లారీ ఇరుక్కుపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ( జులై 23 ) కూనారం రైల్వే గేట్ దగ్గర చోటు చేసుకుంది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట నుండి కాకినాడకు వెళ్తున్న ధాన్యం లారీ కూనారం రైల్వే గేట్ వద్ద పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది.

గత పది రోజులుగా రైల్వే ట్రాక్ మరమ్మత్తులు చేసేందుకు గేటు మూసివేసిన రైల్వే అధికారులు మరమ్మతుల అనంతరం గేట్లు తెరిచారు. పట్టాలు ఎగువ దిగువ ఉండడం వల్లే అధిక బరువుతో ఉన్న లారీ పట్టాల మధ్యలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై  అప్రమత్తమైన రైల్వే అధికారులు పై అధికారులకు సమాచారం అందించగా పలు రైళ్ల రాకపోకలను ఎక్కడికక్కడ పూర్తిగా నిలిపివేశారు..

స్థానికులు, రైల్వే సిబ్బంది లారీని పట్టాలపై తొలగించేందుకు గంటసేపు శ్రమించినా ఫలితం లేదు. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు జేసీబీని తెప్పించి పట్టాలపై నుండి ధాన్యం లారిని తొలగించడంతో రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.