July 23, 2026

Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!

Romanchakam: ప్రేమలో మునిగిపోయే మెలోడీ.. ‘రొమాంచకం’ నుంచి ‘రాధా రమణ’ పాట రిలీజ్!
Reading Time: < 1 minute
Romanchakam First Song Radha Ramana Out Sumanth Prabhas Romantic Melody Wins Hearts

Romanchakam: ప్రేమకథలకు సంగీతం ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకేలా పాటలు ఉంటే సినిమాకు కూడా ఢోకా ఉండదు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతినే అందించేందుకు సిద్ధమైంది ‘రొమాంచకం’. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో యువతలో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం, ఇప్పుడు తొలి పాట ‘రాధా రమణ’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే మంచి స్పందన అందుకుంటోంది. రాధా కృష్ణుల ప్రేమను గుర్తు చేసేలా రూపొందిన ఈ పాట, సంగీతంతో పాటు దృశ్యపరంగానూ ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ పాట కూడా ప్రేమలోని మాధుర్యాన్ని చాలా చక్కగా అందిస్తోంది.

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అందించిన సాహిత్యంతో ఈ పాట వినసొంపుగా మారింది. పాటలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ మధ్య  కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనంతిక తన అందమైన డ్యాన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాకి వేణు గోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగా సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోగా, ఇప్పుడు ‘రాధా రమణ’ పాట కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ, మధురమైన సంగీతంతో నిండిన ఈ పాట ‘రొమాంచకం’పై అంచనాలను మరింత పెంచింది. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు అభిమానులు ఈ  సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.