బ్యాటరీలతో ప్రయోగం చేస్తూ నోట్లో పెట్టుకోవడంతో అది పేలి చచ్చిపోయాడు !
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గూడెం గ్రామంలో ఘటన
కాగజ్నగర్, వెలుగు: బ్యాటరీలతో ప్రయోగం చేస్తూ నోట్లో పెట్టుకోవడంతో అది పేలి ఓ స్టూడెంట్ చనిపోయాడు. కుటుంబీకులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన నికాడి శారద, గణేశ్ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. లోకేశ్(14) గ్రామంలోని స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం స్కూల్కు వెళ్లేందుకు రెడీ అయ్యాడు.
అదే సమయంలో ఇంట్లో ఉన్న బ్యాటరీలతో ప్రయోగం చేస్తూ ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో చిన్న బ్యాటరీని నోట్లో పెట్టుకోగా, అది ఒక్కసారిగా పేలడంతో లోకేశ్ ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకును స్థానికుల సాయంతో ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా కర్జెల్లి గ్రామ సమీపంలో చనిపోయాడు.