Reading Time: < 1 minute
PM Modi: పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన.. అలా చేస్తే ఎవ్వరినీ వదలం!

దేశ వ్యాప్తంగా నీట్‌ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాజాగా ఈ పేపర్‌ లీక్‌ల వ్యవహారంపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పేపర్ లీకేజీ కేసులపై వేగవంతమైన విచారణ జరిపి, నిందితులకు త్వరిత శిక్షలు వేసేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ఈ మేరకు ప్రధాని మోదీ వేదిక ‘X’ పోస్ట్ చేస్తూ.. దేశ యువత భవిష్యత్తు, వారి సంక్షేమమే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటం, పరీక్షల వ్యవస్థలోని పారదర్శకతను రక్షించడం కోసం చేపడుతున్న వరుస చర్యలలో ఇది కూడా ఒక భాగమని మోదీ అన్నారు.

పేపర్ లీకేజీలకు పాల్పడి దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఏమాత్రం వదిలిపెట్టేది లేదు అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి లీకేజీలపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో తక్షణ విచారణ చేపట్టి.. దోషులకు కఠిన శిక్షలు పడేలా చేస్తాయని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.