July 23, 2026

ఆ పేద మహిళకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించండి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు కీలక ఆదేశాలు..

ఆ పేద మహిళకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించండి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు కీలక ఆదేశాలు..
Reading Time: < 1 minute
ఆ పేద మహిళకు వెంటనే క్యాన్సర్ చికిత్స అందించండి.. బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు కీలక ఆదేశాలు..

పేదలకు ఉచిత వైద్యం అందించే విషయంలో ఆసుపత్రులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వ రాయితీలతో భూమిని పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు తమ సామాజిక బాధ్యత నుంచి తప్పించుకోలేవని.. ఈ విషయంలో మినహాయింపు ఉండదని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి కీలక ఆదేశాలు జారీ చేసింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన రొమ్ము క్యాన్సర్ బాధితురాలు బాలె భాగ్యమ్మకు 25 శాతం ఉచిత ఇన్‌పేషెంట్ కోటా కింద వెంటనే చికిత్స ప్రారంభించాలని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషనర్ చికిత్సలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా తీవ్ర పరిణామాలు ఉంటాయని మందలించింది.

వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతోంది.. ఈ క్రమంలో చికిత్స కోసం బసవతారకం ఆసుపత్రిలో చేరింది.. అయితే.. ఆమెకు అందించే చికిత్స ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాదని, ఖర్చులన్నీ ఆమెనే భరించాలని బసవతారకం హాస్పిటల్ సిబ్బంది స్పష్టంచేశారు. తీవ్రమైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. వైద్య ఖర్చులు భరించే స్థితిలో లేనంటూ బసవతారకం హాస్పిటల్‌పై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ కేసును విచారించిన ధర్మాసనం బసవతారకం ఆసుపత్రిపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ ట్రస్ట్ హాస్పిటల్స్ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని సూచించింది. ఇలాంటి ఆసుపత్రులు.. పేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన సామాజిక బాధ్యత (CSR) ఉందనే విషయాన్ని న్యాయస్థానం స్పష్టం చేసింది. సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్సిడీపై పొందిన బసవ తారకం హాస్పిటల్‌ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని సూచించింది. పిటిషనర్ చికిత్సలో ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని.. వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన శస్త్రచికిత్స, రేడియేషన్ లేదా కెమోథెరపీ వంటి అన్ని రకాల వైద్య సేవలను తక్షణమే అందించాలని హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..