Reading Time: < 1 minute
Thaman Responds To Music Trolls And Theater Speakers Issue

Thaman: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్ సంగీతంపై సోషల్ మీడియాలో తరచూ ఎలాంటి చర్చ నడుస్తుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఇచ్చే హెవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, లౌడ్ మ్యూజిక్‌పై ఒకవైపు ప్రశంసలు వస్తూనే.. మరోవైపు థియేటర్లలో స్పీకర్లు పగిలిపోతున్నాయంటూ నెటిజన్లు మీమ్స్, ట్రోల్స్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై తమన్ తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్పీకర్లు పేలడం ఏంటో నాకు అర్థం కాలేదు

తన మ్యూజిక్ లౌడ్‌నెస్‌పై వచ్చే కామెంట్స్ గురించి తమన్ మాట్లాడుతూ.. “చాలా మంది నా మ్యూజిక్ వింటే థియేటర్లలో స్పీకర్లు పేలిపోతున్నాయని అంటున్నారు. అసలు ఆ స్పీకర్లు పేలడం అనేది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ, జనాలు అలా ఎందుకు అంటున్నారనే దాని గురించి నేను కూడా కచ్చితంగా ఆలోచించాలి” అని చెప్పారు. తన కంపోజిషన్ స్టైల్‌ గురించి చెబుతూ.. కథకు తగ్గట్టుగానే సంగీతం ఉంటుందని తమన్ స్పష్టం చేశారు. “ఎప్పుడైనా సరే సినిమాను బట్టే నా మ్యూజిక్ ఉంటుంది. తెరపై సీన్ డిమాండ్ చేసినప్పుడే నేను హెవీ మ్యూజిక్ ఇస్తాను. వాళ్లు స్క్రీన్ మీద ప్రేమించుకుంటుంటే.. నేను వాళ్లు కొట్టుకుంటున్నట్టు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వలేను కదా” అంటూ కౌంటర్ ఇచ్చారు. యాక్షన్ సీన్లకు, ఎమోషనల్ సీన్లకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని బట్టే తన ట్యూన్స్ మారుతుంటాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఆయన OG ఇండియా టూర్‌తో బిజీగా ఉన్నారు. ఈ శనివారం హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది.