Reading Time: < 1 minute
Mamata Banerjee Shock Tmc Mps Meet Bjp Support Nda

Trinamool Congress: బెంగాల్‌తో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఓ వైపు ఇండియా కూటమి సమావేశానికి మమతా బెనర్జీ హాజరయ్యారు, మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీలు బీజేపీతో సమావేశమయ్యారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి, బీజేపీ నేతలు భూపేంద్ర యాదవ్‌లతో వీరంతా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బెంగాల్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసి, మమతను కాదని రీటబ్రత బెనర్జీ వైపు వెళ్లారు. 80 మంది ఎమ్మెల్యేలలో 60 మంది ఆయనకు మద్దతు ఇచ్చారు.

20 మంది టీఎంసీ ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి తామంతా మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇప్పటికే తృణమూల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇప్పుడు ఎంపీలు కూడా మమతకు బిగ్ షాక్ ఇచ్చారు. తామంతా టీఎంసీలో ఉన్నామని చెబుతూనే, వేరే పక్షంగా ఉంటామని వెల్లడించారు. టీఎంసీకి చెందిన 29 లోక్‌సభ ఎంపీల్లో 20 మంది బీజేపీ వైపు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టీఎంసీకి 13 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయడంతో మరికొందరు కూడా ఆయన బాటలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.