Reading Time: < 1 minute
Raghava Lawrences Key Statement On Political Entry On June 11th

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే తమిళనాడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ గెలిచి రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి TVK పార్టీ తరపున  ఎన్నికల బరిలోకి దిగుతున్నారంటూ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీ రూమర్లపై స్పందిస్తూ రాఘవ లారెన్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

పొలిటికల్ ఎంట్రీ వార్తలపై క్లారిటీ ఇస్తూనే లారెన్స్ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఇచ్చారు.. ఇంతకీ లారెన్స్ ఏమన్నాడంటే.. ‘తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు విజయ్ పార్టీ TVK తరపున తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీ చేయబోతున్నట్టు వస్తున్న న్యూస్ కొన్ని రోజులుగా వింటున్నాను. ప్రస్తుతం నేను సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నాను, నా రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బెంజ్’ సినిమా షూటింగ్‌లో నాన్‌స్టాప్‌గా పాల్గొంటున్నాను. కానీ జూన్ 11వ తేదీ ఉదయం 9:30 గంటలకు నా జీవితానికి సంబంధించి ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తాను. మా అమ్మ ఆశీర్వాదంతో ఈ పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను’ అని అన్నాడు. లారెన్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఆ రోజు లారెన్స్ తన రాజకీయ ఎంట్రీని ప్రకటిస్తారా? లేక ఏదైనా సరికొత్త సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా? అనేది తెలియాలంటే జూన్ 11 వరకు వేచి చూడాల్సిందే.