
PM Modi Hyd Tour Live Updates : ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే 30 నిమిషాలు ఆలస్యంగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు రాష్ట్ర నాయకులు, బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీకి చేరుకున్న ప్రధాని.. వర్చువల్ విధానంలో రూ. 9,400 కోట్ల విలువైన జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కొత్తగా నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బేగంపేట నుంచి హైటెక్ సిటీ వరకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించగా, ఈ కార్యక్రమాల అనంతరం ఆయన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. మోడీ పర్యటనకు సంబంధించి మినిట్ టూ మినిట్ అప్డేట్స్ మీకోసం..