Reading Time: < 1 minute
Ram Charan Peddi North America Ticket Prices Bookings Open

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న “పెద్ది” సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ జూన్ 4న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా, అమెరికాలో మాత్రం ఒకరోజు ముందే అంటే జూన్ 3న భారీ ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి. తాజాగా నార్త్ అమెరికాకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే కాకుండా, టికెట్ ధరలను కూడా అధికారికంగా ప్రకటించారు.

తెలుగు వెర్షన్ టికెట్ ధరలు:
ప్రీమియర్స్ (జూన్ 3): స్టాండర్డ్ 2D స్క్రీన్ల కోసం పెద్దలకు $25, పిల్లలకు $20 గా ఫిక్స్ చేశారు. ఒకవేళ మీరు బిగ్ స్క్రీన్లు (PLF) లేదా స్పెషల్ ఫార్మాట్లలో చూడాలనుకుంటే అదనంగా మరో $5 నుండి $10 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి వారం టికెట్ రేట్లు కొంచెం తగ్గుతాయి. పెద్దలకు $20, పిల్లలకు $18 గా ఉండబోతున్నాయి. ఇక హిందీ, తమిళం, కన్నడ,మలయాళ వెర్షన్లకు మాత్రం ప్రీమియర్ రేట్లు ఉండవు. మొదటి రోజు నుండే సాధారణ ధరలకే టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి భారీ స్టార్ కాస్ట్ ఉండటంతో అమెరికా బాక్సాఫీస్ వద్ద చరణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.