Reading Time: < 1 minute
Ap Cm Chandrababu Delhi Tour Meetings With Amit Shah Central Ministers And World Bank

CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తోనూ ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించమన్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సీఎంతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్ లో భారత పరిశ్రమల సమాఖ్య బిజినెస్ సమ్మిట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ప్రధాని ఆర్ధిక సలహా మండలి చైర్మన్ ఎస్. మహేంద్రదేవ్ సహా నీతిఆయోగ్ సభ్యులతో సమావేశం అవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇక, రేపు రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం.. తదుపరి రోజు కూడా కొన్ని కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.