Reading Time: < 1 minute
Honeymoon Murder Case Sonam Raghuvanshi Gets Bail Shillong

Honeymoon murder: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ పక్కా ప్లాన్‌తో హనీమూన్ కోసం మేఘాలయ తీసుకెళ్లి అక్కడ హత్య చేసింది. ఈ ఘటన వల్ల పెళ్లిళ్లు అంటేనే యువకులు భయపడేలా చేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆమె చాలా కాలంగా షిల్లాంగ్ జైలులో ఉన్నారు. సోనమ్ రఘువంశీతో పాటు 8 మందిని షిల్లాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, ఇప్పుడు సోనమ్‌కు ఉపశమనం లభించింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.

Read Also: Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..

రాజా రఘువంశీకి, సోనమ్‌కు 2025 మే నెలలో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది కాలానికే వీరిద్దరు మేఘాలయలోని షిల్లాంగ్‌కు హనీమూన్ కోసం వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. షిల్లాంగ్‌లోని ఒక జలపాతానికి సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని 2025 జూన్2న గుర్తించారు.

సోనమ్ రఘువంశీ కోసం పోలీసులు వెతుకున్న క్రమంలో ఆమె 2025 జూన్ 09న యూపీలోని ఘాజీపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమన్ రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ప్రేమ వ్యహరం నడుపుతుందని, ఇద్దరు కలిసి రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆకాష్, ఆనంద్, విశాల్ అనే ముగ్గురు నిందితులు రాజాను హత్య చేసి లోయలో పారేశారు.