Reading Time: 2 minutes
42 Teeth Record: రికార్డ్ బ్రేకింగ్ స్మైల్.. 42 పళ్లతో నవ్వితే వరల్డ్‌ గిన్నిస్‌ బుక్‌ కదిలి వచ్చింది..!

సాధారణంగా మనుషులందరికీ 32 దంతాలే ఉంటాయి. ఎవరూ 32 కంటే ఎక్కువ దంతాలు కలిగి ఉంటారని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు.. కానీ, మలేసియాకు చెందిన ప్రతాప్ మునియాండి అరుదైన ప్రపంచ రికార్డు సాధించి వార్తల్లో నిలిచారు. సాధారణంగా మనుషుల నోటిలో 32 పళ్ళు ఉంటాయి. కానీ ప్రతాప్ మునియాండికి మొత్తం 42 పళ్ళు ఉండటం వైద్యులను, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రత్యేక లక్షణంతో ఆయన ప్రపంచంలో అత్యధిక పళ్ళు కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

వైద్య నిపుణుల ప్రకారం, కొంతమంది వ్యక్తుల్లో హైపర్‌డాంటియా అనే అరుదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో సాధారణంగా ఉండే పళ్ళ కంటే అదనంగా పళ్ళు పెరుగుతాయి. ప్రతాప్ మునియాండికి కూడా అదే పరిస్థితి ఉండటంతో ఆయన నోటిలో మొత్తం 42 పళ్ళు ఏర్పడ్డాయి. ఇది సాధారణ సంఖ్య కంటే 10 పళ్ళు ఎక్కువ. ఈ ప్రత్యేకతను గుర్తించిన వైద్యులు ఆయనను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. అనంతరం ఈ విషయం ప్రపంచ రికార్డు సంస్థల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పేరు రికార్డు జాబితాలో చోటు సంపాదించింది. అత్యధిక పళ్ళు కలిగిన వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

ప్రతాప్ మునియాండికి చిన్నప్పటి నుంచే సాధారణం కంటే ఎక్కువ పళ్ళు ఉన్నాయని కుటుంబ సభ్యులు గమనించారు. మొదట్లో ఇది పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనప్పటికీ, కాలక్రమేణా వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు అదనపు పళ్ళు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే ఈ పళ్ళ వల్ల ఆయనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకపోవడం ఆశ్చర్యకర విషయం అని వైద్యులు చెబుతున్నారు. మనుషులలో ఇలాంటి అరుదైన పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తాయని చెప్పారు.. సాధారణంగా అదనపు పళ్ళు ఉంటే వాటిని తొలగించేందుకు కొందరు సర్జరీ చేయించుకుంటారు. అయితే ప్రతాప్ మునియాండికి ఉన్న అదనపు పళ్ళు ఆయనకు పెద్దగా ఇబ్బంది కలిగించకపోవడంతో అవి అలాగే ఉంచినట్టు తెలుస్తోంది.

ప్రతాప్ మునియాండి తన నోటిలో 42 పళ్ళుతో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన కథ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. X లో @GWR నాలుగు ఫోటోలను పోస్ట్ చేసి, నవ్వండి! మలేషియాకు చెందిన ప్రతాప్ మునియాండికి 42 దంతాలు ఉన్నాయి. సాధారణం కంటే 10 ఎక్కువ. అందువల్ల, అతను మనిషి నోటిలో అత్యధిక దంతాల రికార్డును కలిగి ఉన్నాడు. ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ పోస్ట్ ఇప్పటివరకు 460,000 కంటే ఎక్కువ వ్యూస్‌ సంపాదించింది. పోస్ట్ పై 250కామెంట్స్, 2,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..