Reading Time: < 1 minute
Jitesh Sharma Prays For Top Order Collapse

Jitesh Sharma: టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ జితేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో వివాదానికి దారి తీశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు, తాను బ్యాటింగ్‌కు వచ్చే పరిస్థితుల గురించి నిజాయితీగా చెప్పాడు. అయితే, నేను ఆడే జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలాలని ఆ దేవుడిని ప్రార్థిస్తుంటాను అని చెప్పుకొచ్చారు. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వెళ్లడం వల్ల నాకు హీరో అయ్యే ఛాన్స్ వస్తుందని జితేశ్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి వ్యాఖ్యలు అరుదుగా వినిపిస్తాయని క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Read Also: Tamil Nadu: పెళ్లికి ఒప్పుకోలేదని లవర్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు..

అంతేకాదు, జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం తనకు ఎంతో ఇష్టమని జితేష్ శర్మ తెలిపారు. సవాళ్లను ఎదుర్కోవడం నాకు చాలా ఇష్టం.. టీమ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వెళ్లి పరిస్థితిని పూర్తిగా మార్చే మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాలని నేను కోరుకుంటా.. అప్పుడు జట్టును ఆదుకునే ఛాన్స్ వస్తుంది అని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా రన్స్ సాధించే సామర్థ్యం ఉన్న జితేశ్ శర్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.